బ్రేకింగ్: దినకరన్ కు దిమ్మ తిరిగే షాక్

దినకరన్ వర్గానికి హైకోర్టులో షాక్ తగిలింది. మద్రాస్ హైకోర్టులో దినకరన్ వర్గానికి  షాక్ తగిలింది. అన్నాడీఎంకేను వ్యతిరేకిస్తూ 18 మంది ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరారు. ఈ 18 మందిపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేశారు. దీనిపై దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే మద్రాస్ హైకోర్టులో ఈ కేసును స్వీకరించిన ఇద్దరు జడ్జిల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్పీకర్ నిర్ణయాన్ని ఒక న్యాయమూర్తి సమర్థించగా, మరొకరు వ్యతిరేకించారు. దీంతో ఈకేసును  ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి పంపాలని నిర్ణయించారు. దీంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వానికి తాత్కాలిక ఊరట లభించినట్లయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*