ముందస్తు ముహూర్తం కుదరలేదు..!

ముందస్తు ఎన్నికల కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెట్టుకున్న ముమూర్తం కుదరినట్లు లేదని, ఆయన ఏ కార్యక్రమం నిర్వహించినా విఫలమవుతోందని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభతో పాటు హుస్నాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ కూడా విఫలమైందని ఆమె పేర్కొన్నారు. కొండా సురేఖకు టీఆర్ఎస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని ఆమె విమర్శించారు. ఆ పార్టీకి మహిళల పట్ల గౌరవం లేదని ఆరోపించారు. కేసీఆర్ మాటలన్నీ అబద్ధాలే అని ప్రజలు గుర్తించారని ఆమె పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*