ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే ఇక అంతే…

గత రెండు రోజులుగా అన్ని వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ‘17వ వార్షికోత్సవం సందర్భంగా డీమార్ట్ రూ.2500 ఫ్రీ షాపింగ్ వోచర్ ఇస్తుంది’’ అనేది ఆ వార్త సారాంశం. ఇందుకు సంబంధించి లింక్ ఓపెన్ చేస్తే అచ్చం డీమార్ట్ వైబ్ సైట్ లానే కనిపించే neuenwfarben.com అనే బోగస్ సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇది జర్మనీకి చెందిన ఓ వోచర్ స్కామ్ కు చెందిన వైబ్ సైట్. ఈ సైట్ ఓపెన్ చేసి అక్కడ మనం ఇచ్చిన సమాచారం చోరీకి గురవుతుంది. మనం మెపేజ్ ఫార్వర్డ్ చేసిన నంబర్లు కూడా వారికి చేరతాయి. ఈ సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, ఈ మెసేజ్ ను ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు. ఎవరికీ ఫార్వర్డ్ చేయవద్దు. ఒకవేళ ఇప్పటికే ఈ మెసేజ్ ఓపెన్ చేసినవారు వెంటనే తమ ఈమెయిల్ ఐడీ, బ్యాంకు, ఇతర ముఖమైన వాటి పాస్ వర్డ్ లు మార్చుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంపై డీమార్ట్ కూడా స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, మెసేజ్ లు బోగస్ అని, తాము అటువంటి ఆఫర్లు ఏమీ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*