దిగివచ్చిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్

(FILES) File picture dated August 1, 2008 shows an Emirates Airline flight from Dubai landing at John F. Kennedy International Airport in New York. Dubai-based airline Emirates announced on September 8, 2008 that it is suspending flights using its lone Airbus A380 superjumbo until later this week while repairs are carried out. AFP PHOTO/Stan HONDA (Photo credit should read STAN HONDA/AFP/Getty Images)

తమ విమాన సర్వీసుల్లో ఇక హిందూ మీల్స్ అందించమని ప్రకటించిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ విమానయాన సంస్థ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దుబాయ్ కి చెందిన ఈ సంస్థ భారత్ నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడిపే ప్రధాన సంస్థల్లో ఒకటి. అయితే, తమ కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ను సమీక్షించిన అనంతరం ఇక నుంచి ప్రయాణికులకు హిందూ మీల్స్ అందివ్వమని ఆ సంస్థ నిన్న ప్రకటించింది. శాఖాహారులు హిందూ మీల్స్ స్థానంలో ఇండియన్ వెజిటేరియన్ మీల్, జైన్ మీల్స్ వంటివి తీసుకోవచ్చని సూచించింది. అయితే, ఈ నిర్ణయంపై హిందూ ప్రయాణికుల నుంచి వచ్చిన సూచనల మేరకు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని, హిందూ మీల్స్ ను యధావిధిగా అందిస్తామని ప్రకటించింది ఆ సంస్థ.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*