నరసింహన్ ఢిల్లీ టూర్ అందుకేనా?

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు.ఆయన ఈరోజు ఉదయం హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ నరసింహన్ మోడీకి వివరించినట్లు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మోడీని కలిశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులను గవర్నర్ నరసింహన్ ప్రత్యేకంగా మోడీకి వివరించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో కటీఫ్ చెప్పిన తర్వాత కేంద్రప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష సభలు పెట్టి కేంద్రాన్ని, మోడీని దోషులుగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందంటూ చంద్రబాబు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రధానితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.