నడిరోడ్డుపై కాల్పులు… ముగ్గురు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ వార్ సంచలనం సృష్టించింది. సినీ ఫక్కీలో రెండు గ్యాంగ్ లు ఒకరిపై ఒకరు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గోగీ గ్యాంగ్, టిల్లూ గ్యాంగ్ ల మధ్య చాలా రోజులుగా గ్యాంగ్ వార్ ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కార్లలో వెళ్తున్న రెండు గ్యాంగులు ఎదురుపడగా కాల్పులు జరుపుకున్నారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. పాత కక్షల నేపథ్యంలోనే వీరి మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు ఏ గ్యాంగ్ కి చెందినవారో ఇంకా తేలలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.