బ్రేకింగ్ : గవర్నర్ మరో సంచలన నిర్ణయం

కర్ణాటక గవర్నర్ వాజూభాయి వాలా ఆర్టికల్ 188 ప్రకారం సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కే.జే బొపయ్యను నియమించారు. రేపు యడ్యూరప్ప బలనిరూపణ ఎదుర్కొనే సమయంలో బొపయ్య నియామకం ఊహించలేదు. శాసనసభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ కు చెందిన ఆర్.వి.దేశ్ పాండే ఉన్నారు. ఆయనను నియమిస్తారన్న వార్తలు వచ్చాయి. కాని గవర్నర్ ఊహించని విధంగా బీజేపీ ఎమ్మెల్యే బొపయ్యను ప్రొటెం స్పీకర్ ను నియమించారు. బొపయ్య నియామకంతో బీజేపీకి కొంత ఉపశమనం లభించింది. ప్రొటెం స్పీకర్ గా ఉన్న బొపయ్య రేపు బలపరీక్ష సమయంలో కీలకంగా వ్యవహరించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1