‘‘జీవీఎల్ ఒక పవర్ బ్రోకర్’’
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అవినీతి చిట్టా మొత్తం తన వద్ద ఉందని, ఆయనొక పెద్ద పవర్ బ్రోకర్ అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. జీవీఎల్ అవినీతిని నిరూపించకుంటే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని, ఏపీ నుంచే వెళ్లిపోతానని వెంకన్న సవాల్ విసిరారు. జగన్ యూటర్న్ లు తీసుకోవడంలో సిద్ధ హస్తుడని, ఎక్కడ యూటర్న్ బోర్డులున్నాయో, అక్కడ జగన్ ఫొటో పెట్టాలని వెంకన్న అన్నారు. బీజేపీకి భయపడే రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొనకుండా తప్పించుకుపోయిందని వెంకన్న అన్నారు. అలాగే మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఓటసిందన్నారు. మరో అవినీతి పార్టీ మాత్రం బీజేపీతో లాలూచీపడి పారిపోయిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. జీవీఎల్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- budha venkanna
- corruption
- gvl narasimha rao
- nara lokesh
- power broker
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- అవినీతి
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జీవీఎల్ నరసింహారావు
- తెలుగుదేశం పార్టీ
- నారా లోకేశ్
- పవర్ బ్రోకర్
- బుద్ధావెంకన్న
- భారతీయ జనతా పార్టీ
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ