Fri Apr 19 2024 21:54:55 GMT+0000 (Coordinated Universal Time)
ఆకాశానికెత్తుకున్నారు..!
టీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. కేటీఆర్ స్వంత నియోజకవర్గం సిరిసిల్ల నేతలతో గురువారం హరీష్ రావు, కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తానూ, హరీష్ రావు అన్నదమ్ముల్లా పెరిగామని, ఇప్పుడు కూడా అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని పేర్కొన్నారు. కాలంతో పోటీ పడి మరీ హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారని ప్రశంసించారు. మరో 15 ఏళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని తామిద్దరమూ కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇక హరీష్ రావు కూడా కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆత్మహత్యల ఉరిసిల్లను సిరుల సిరిసిల్లగా కేటీఆర్ మార్చారని పేర్కొన్నారు. సిద్ధపేటలో తన రికార్డు మెజారిటీని సిరిసిల్ల దాటాలని పిలుపునిచ్చారు.
Next Story