బ్రేకింగ్: రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దును కొట్టివేస్తూ హైకోర్టు ఇంతకుముందే తీర్పు ఇచ్చింది. అయితే, ఆ తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. వారిని ఎమ్మెల్యేలుగా పరిగణించడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వంపై వారు కోర్టు ధిక్కారణ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను శుక్రవారం విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంటూ తదుపతి విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా సరైన వివరణ ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యదర్శి కోర్టుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.