బ్రేకింగ్ : ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు

big relief to trs

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద ఉండే ధర్నా చౌక్ ను కొనసాగించాలని హైకోర్టు తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ధర్నాచౌక్ నిరసనలకు అడ్డా. తమకు జరుగుతున్న అన్యాయాలపై, డిమాండ్ల సాధనకై ధర్నాచౌక్ వేదికగా వివిధ వర్గాల వారు గళమెత్తుతారు. అయితే, ట్రాఫిక్ సమస్య, స్థానికులకు ఇబ్బంది కలుగుతుందని, శాంతిభద్రతల సమస్య వంటి కారణాలతో పోలీసులు ధర్నాచౌక్ ను ఎత్తేశారు. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లగా ధర్నాచౌక్ యాధావిధిగా ఇందిరా పార్కు వద్దే కొనసాగించాలని స్పష్టం చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*