బ్రేకింగ్ : టీఆర్ఎస్ కు భారీ ఊరట

తొమ్మిది నెలల ముందే తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. రాపోలు భాస్కర్ అనే అడ్వకేట్ వేసిన పిటీషన్ ను బుధవారం విచారించిన కోర్టు సరైన అంశాలను పిటీషన్ లో పొందుపరచలేదని పేర్కొంది. ఈ పిటీషన్ కేవలం రాజకీయ పలుకుబడి కోసమే అని కోర్టుల అభిప్రాయపడింది. రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో కోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది.