భార్యపై చిల్లర ప్రతీకారం

భర్తతో విడాకులు తీసుకోవాలనుకుంది ఓ భార్య. కోర్టులో కేసు వేసింది. కోర్టు ఆమెకు భరణం చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. దీంతో భార్యపై ప్రతీకారం తీర్చుకునేందుకు చిల్లర పని చేశాడు ఆ భర్త. వివరాల్లోకెళ్తే… ఇండోనేషియా జకర్తాకు చెందిన చిన్న ఉద్యోగి సుసిలార్టో, అతని భార్య హెర్మి విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు భార్యకు అక్కడి కరెన్సీలో రూ.7,33,586 భరణం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీంతో తనను ఇంత భరణం కట్టిస్తున్న భార్యపై పగ తీర్చుకోవాలనుకున్నాడు సుసిలార్టో.

నాణేల రూపంలో…

ఈ మొత్తాన్ని నాణేల రూపంలో కోర్టుకు తీసుకువచ్చాడు. వీటి బరువే 890 కిలోలు. అయితే, తన క్లయింటుపై పగ తీర్చుకోవడానికి, పరువు తీయడానికే అతడు ఇలా చేశాడని భార్య తరపు లాయర్ ఆరోపించారు. అయితే, తనది చిన్న ఉద్యోగమని, అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో స్నేహితులను అడిగానని, స్నేహితులు నాణేలే ఇచ్చారని సుసిలార్టో కోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. మొదట ఈ నాణేలు తీసుకునేందుకు హెర్మి అంగీకరించకపోయినా తర్వాత తప్పక తీసుకుంది. కోర్టే ప్రత్యేకంగా నలుగురు మనుషులను పెట్టి ఈ సొమ్మును లెక్కించి అందజేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*