గతుకుల రోడ్డు 30 లక్షలు మింగేసింది….!

ఆటోలో 30 లక్షల రూపాయల నగదులో ఎక్కింది ఒక మహిళ.. దిగే టప్పడు మాత్రం నగదుతో కూడిన బ్యాగ్ మిస్ అయ్యింది. తనతో పాటుగా ఆటో డ్రైవర్ కూడా వున్నాడు. ఆటోలో ఎక్కేటప్పడు వున్న బ్యాగ్ దిగే టప్పడు లేక పొవడంతో ఆ మహిళ లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆటోను మొత్తం కూడా మహిళ వెతికింది. కాని డబ్బు సంచి కన్పించలేదు. ఆటో డ్రైవర్‌ ను అనుమానించారు..ఆటో ఎక్కడా అగలేదు. కనీసం సిగ్నల్ దగ్గర కూడా ఆగలేదు.మరి తమతో పాటుగా వుండాల్సిన బ్యాగ్ ఎక్కడ పొయిందో మహిళ కు అర్దం కాలేదు. ఆటొ డ్రైవర్ ను వెంటబెట్టుకుని చివరకు పోలీసులకు వద్దకు వెళ్లింది..ఐదు గంటల పాటు పోలీసులు శ్రమించి అసలైన దొంగలను పోలీసులు పట్టుకున్నారు.

సీసీ ఫుటేజీయే కీలకం…..

అయితే ఈ కేసులో సీసీ పుటేజీనే కీలకంగా మారింది. ముప్పేలక్షలను కొట్టేసి తన బాకీలను తీర్చి వేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగిని పోలీసులు పట్టుకుని డబ్బులను రికవరీ చేశారు. అసలు కధలోకి వెళ్లితే.. నల్లకుంటకు చెందిన మోహిని తన తల్లితో కలిసి విజయవాడకు బయలు దేరింది. తల్లి, కూతురు ఇద్దరు కలిసి విజయవాడలో 30 లక్షల రూపాయలను డిపాజిట్ చేయడానికి వెళుతున్నారు. ఐదు బ్యాగ్ లతో వీరు ఆటొలో ఎక్కారు. అయితే దిగే టప్పడు మాత్రం నాలుగు బ్యాగ్ లే ఉన్నాయి. డబ్బులతో వున్న బ్యాగ్ మిస్ అయ్యింది. దీంతో మోహిని .. గొపాలపురం పోలీసులను ఆశ్రయించింది. అయితే తమ బ్యాగ్ ఎలా మిస్ అయ్యిందో అర్దం కావడం లేదని చెప్పారు. అయితే నల్లకుంట నుంచి సికింద్రబాద్ రైల్వే స్టేషన్ వరకు వున్న ముఖ్యమైన 42 కెమెరాలను పోలీసులు పరిశీలించారు. కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు..ఆటో డ్రైవర్ ,ఆమె కుతురిని పలుమార్లు విచారించినా వారి పై అనుమానం రాకపోవడంతో చివరికి సీసీ కెమెరా పుటేజీ ని పరిశీలించారు.

22వ కెమెరా వద్ద……

22 వ కెమెరా వద్ద ఆటో గతుకుల రోడ్లో ఎత్తేయడంతో బ్యాగ్ పడి పోయినట్టు సీసీ ఫుటేజ్ లో స్పష్టమైంది..ఈ బ్యాగ్ పడిపోయిన ఇరవై ఐదు నిమిషాల తరువాత జిహెచ్ యంసి కాంట్రాక్ట్ స్వీపర్ బ్యాగును తీసుకున్నారు. అందులో డబ్బులు వుండడంతో తన బుద్ది మారిపొయింది. బ్యాగ్ లో వున్న నగదును మరొక బ్యాగ్ లోకి మార్చుకున్నాడు. బ్యాగ్ ను యాధావిధిగా రొడ్డు మీద పెట్టి వెళ్లిపొయాడు.అయితే తనకు వున్న అప్పులన్నింటిని కూడా ఉద్యోగి రాములు తీర్చేశాడు..ఇంకా 28 లక్షల రూపాయలను తన దగ్గర పెట్టుకున్నారు. కేసును చాలేంజ్ గా తీసుకున్న పోలీసులకు ఈ సీసీ పుటేజి ఒక వరంగా మారింది.. వెంటనే రాములును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతని దగ్గర నుంచి 28 లక్షల రూపాయలను స్వాధీన పరుచుకున్నారు. అయితే ప్రజలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సాయంతో నే ఈ కేసును ఛేదించ గలిగామని నార్త్ జోన్ పోలీసులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*