మోదీపై నోరు పారేసుకున్న ఇమ్రాన్ ఖాన్

భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. మోదీని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల కోసం తన ఆహ్వానాన్ని భారత్ తిరస్కరించడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఇమ్రాన్… తన అసలు స్వభావాన్ని చాటుకున్నారు. కొందరికి దార్శనికత ఉండదని ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించి తాను ప్రపంచ శాంతి కోరే దయామూర్తి అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. వాస్తవానికి న్యూయార్క్ లో భారత్-పాక్ విదేశాంగ మంత్రుల సమావేశం జరగాల్సి ఉంది.

వక్రబుద్ధి చూపెట్టుకున్న పాక్…

అయితే, ఈలోపే కశ్మీర్ లో భారత జవాన్ నరేంద్ర సింగ్ హత్య, ముగ్గురు పోలీసులను తీవ్రవాదులు ఇళ్ల నుంచి కిడ్నాప్ చేసి హత్య చేయడం, ఉగ్రవాది బుర్హాన్ వనీని స్వాతంత్ర్య పోరాట యోధుడిగా కీర్తిస్తూ పాకిస్థాన్ పోస్టల్ స్టాంప్ విడుదల చేసి తన వక్రబుద్ధిని చాటుకుంది. దీంతో విదేశాంగ మంత్రుల భేటీని భారత్ రద్దు చేసుకుంది. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన ఇమ్రాన్…‘‘శాంతి చర్చల కోసం తానిచ్చిన పిలుపుపై భారత్ అహంకారపూరిత, ప్రతికూల స్పందనతో నిరాశకు గురయ్యాను. దార్శనికత లేని కొందరు చిన్నస్థాయి వ్యక్తులు పెద్ద కార్యాలయాలను సొంతం చేసుకోవడం నా జీవితంలో చాలా మందిని చూశాను’’ అని ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*