ఇండియ‌న్ బీరా… మ‌జాకా..!

చైనీయులు మ‌న‌కంటే ఎంత గొప్ప అని వారికి వారు చెప్పుకున్నా… మీర‌ట్ లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న చూస్తే వీరి స్టామినా ఇంతేనా అనాల్సిందే. ఆదివారం సాయంత్రం మీర‌ట్ లోని ఘ‌ర్ రోడ్ లో ఓ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ముందు ఉన్న కారు వెనుక నుంచి వ‌చ్చిన ఓ కారు బ‌లంగా ఢీకొట్టింది. దీంతో ఆగ్ర‌హించిన రాజీవ్ ర‌స్తోగి అనే ముందు కారు డ్రైవ‌ర్ కారు దిగి ఢీకొట్టిన కారు వ‌ద్ద‌కు వెళ్లాడు. ఆ కారులో చూస్తే ఇద్ద‌రు చైనీయులు త‌ప్ప‌తాగి, బ‌ట్ట‌లు కూడా వేసుకోకుండా ఉన్నారు. దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం అత‌డి వంతైంది. వెంట‌నే సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్ద‌రు చైనీయుల‌కు బ‌ట్ట‌లు ఇచ్చి వారిని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. వీరిని పోలీసులు విచారించ‌గా… తాము ఓ పార్టీకి వెళ్లి వ‌స్తున్నామ‌ని, ఇండియ‌న్ బీర్ తాగామ‌ని, ఆ బీర్ ని తాము హ్యాండిల్ చేయ‌లేక‌పోయామ‌ని స‌మాధానం చెప్పారు. వీరిద్ద‌రు ఓ చైనా కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఎక్స్‌ప‌ర్ట్ లుగా ప‌నిచేస్తున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*