బ్రేకింగ్ : పాదయాత్రలో అదుర్స్…. చారిత్రక ఘట్టం…!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో చారిత్రక ఘట్టానికి సోమవారం విజయనగరం జిల్లా వేదికైంది. ఆయన పాదయాత్ర సోమవారం 3 వేల కిలోమీటర్ల మైలురాయికి చేరింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం దేశపాత్రునిపాలెం గ్రామంలో ఆయన పాదయాత్ర ఈ మైలురాయి చేరింది. ఈ సందర్భంగా ఆయన పైలాన్ ఆవిష్కరించడంతో పాటు రావి మొక్క నాటారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళే జగన్ 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని 12వ జిల్లా అయిన విజయనగరంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*