దేవుడంటే భయమూ భక్తిలేని వ్యక్తి ఆయన

ysjaganmohanreddy vs pawan kalyan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుడి సొమ్మును, ఆస్తులను కూడా దోచేస్తున్నారని, దేవుడంటే భయమూ, భక్తి లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఎన్నికల ప్రణాళికలో బ్రాహ్మణులకు ఇచ్చిన ఏ హామీని కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని ఆరోపించారు. దేవుడి ఆలయాల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారని, ఆలయాల ఆస్తులను అన్యాక్రాంతం చేసి చంద్రబాబు సన్నిహితులకు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. రమణ దీక్షితులు, ఐవీఆర్ కృష్ణారావులకు చంద్రబాబు అన్యాయం చేశారని పేర్కొన్నారు. విజయవాడ దుర్గమ్మ గుడితో తాంత్రిక పూజలు అనేది దారుణమని, ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*