విజయనగరం ఎంట్రీ అదిరిపోలా….!

Jagan meeting in srikakulam

మన రాష్ట్రంలో రైతుల ధీన పరిస్థితిపై నిజాయితీగా అమెరికాలో ప్రసంగించే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… రైతుల గురించి చంద్రబాబు మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే అని అన్నారు. వ్యవసాయంలో రాష్ట్రం అట్టడుగున ఉందని నాబార్డు నివేదిక ఇచ్చిన విషయాన్ని, వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన వైనాన్ని అమెరికా ప్రసంగంలో చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా అని ప్రశ్నించారు.

రాష్ఠ్రంలో పెరిగిన అవినీతి……

అన్నింటా చంద్రబాబు తీవ్రంగా విఫలమయ్యారని, రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను నీరుగారుస్తూ తన బినామీ సంస్థలు నారాయణ, శ్రీచైతన్యలకు లాభం చేస్తున్నారన్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తిస్థాయిలో ఇవ్వనందున పిల్లలు ఇంజనీరింగ్ చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. జగన్ సభకు అపూర్వ స్పందన కన్పించింది. ఇసుకవేస్తే రాలనంత మంది జనం సభకు హాజరవ్వడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*