అవి చిలుకా గోరింకలు..!

తమ ప్రభత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకువస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన పాదయాత్ర విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో కొనసాగింది. సబ్బవరంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాలుగేళ్ల పాటు చిలుకా గోరింకల్లా కలిసి ఉన్నాయని, ఇప్పుడు విడిపోయాక మాత్రం ఒకరినొకరు విమర్శించుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు, ఆయన అనుకూల మీడియాకు వాళ్లకు నచ్చిన వారిని పల్లెత్తు మాట కూడా అనరని, వారికి నచ్చకపోతే మాత్రం వారిని విమర్శిస్తారని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*