చంద్రబాబు సినిమా అయిపోయింది

ys jaganmohanreddy ysrcongressparty

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని భ్రమరావతిగా మార్చారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. రాజధాని నిర్మాణం చేసే ఉద్దేశ్యమే చంద్రబాబుకు లేదన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పారని, కాని ఆ ప్లాట్లు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని జగన్ ఎద్దేవా చేశారు. రాజధానిలో ఇల్లు కట్టుకోకుండా చంద్రబాబు హైదరాబాద్ లో ఎందుకు ఇంద్రభవనాన్ని ఇల్లు కట్టుకున్నారని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా రాజధానిపై చంద్రబాబు సినిమా చూపిస్తున్నాడని సెటైర్ వేశారు. ప్రత్యేక హోదాపై మాయాజాలాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తున్నారన్నారు. చంద్రబాబు సినిమా చూసి ప్రజలకు విసుగెత్తి పోయారన్నారు. విజయవాడ చిట్టినగర్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ వస్తుందో తెలిసిన చంద్రబాబు వందలాది ఎకరాలను కొనుగోలుచేశారని ఆరోపించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*