14 నెలల తర్వాత కడపకు జగన్… భారీ స్వాగతం..!

ys jagan reached kadapa

సుదీర్ఘ పాదయాత్ర ముగించుకుని 14 నెలల తర్వాత కడప జిల్లాకు వచ్చిన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. తిరుమలలో స్వామి వారి దర్శనం అనంతరం ఆయన ఇవాళ కడపకు బయలుదేరారు. రైల్వే కోడూరు వద్ద కడప జిల్లాలోకి జగన్ ప్రవేశించే ప్రాంతంలో పెద్దఎత్తున కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఇవాళ జగన్ కడపలోని పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. రేపు తన స్వంత నియోజకవర్గం పులివెందుల వెళ్లి సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలతో పాటు తన తండ్రి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండి పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*