జగన్ ను అడుగడుగునా అడ్డుకుంటూ…!

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు అడ్డంకులు ఏర్పడేలా కనపడుతోంది. కాపుల రిజర్వేషన్లు కేంద్ర పరిధిలో ఉన్నాయని, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాపులకు రిజర్వేషన్లపై తాను హామీ ఇవ్వలేనని జగన్ చేసిన ప్రకటనపై కొందరు కాపుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో కాపుల జనాభా అధికంగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో జగన్ కు కాపుల నుంచి కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. ఇవాళ పాదయాత్ర మరికాసేపట్లో ఎఫ్.కె.పాలెం చేరుకోనుంది. అయితే, ఎఫ్.కె.పాలెంలో కాపు యువకుల నిరసన చేపడుతున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు జగన్ హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.