జగన్ రికార్డు విన్నారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని శనివారం చిన్ననాటి మిత్రులు కలిశారు. బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 1991వ బ్యాచ్ కి చెందిన సుమారు 30 మంది జగన్ స్నేహితులు విశాఖపట్నం వచ్చారు. జగన్ ను కలిసి ఆయనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జగన్ కు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు ఉండేవని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాస్ లీడర్ గా ఉండి రికార్డు సృష్టించారని వారు పేర్కొన్నారు.

గర్వంగా ఉంది…

వైఎస్ జగన్ రెడ్ హౌజ్ కెప్టెన్ గా వ్యవహరించారని, ఆల్ రౌండర్ షీల్డ్ లు కూడా అందుకున్నారని గుర్తుచేసుకున్నారు. పాఠశాలలో కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ అందరికీ అండగా ఉండేవారని పేర్కొన్నారు. జగన్ ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యమేసిందని, అటువంటి వ్యక్తి తమకు స్నేహితుడు కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. జగన్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*