జగ్గారెడ్డి అరెస్ట్ వెనక?

అతను ఒక ఎమ్మెల్యే. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనుషుల అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏకంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద మరొకరిని అమోరికాకు తీసుకుని వెళ్లారు. 14 ఏళ్ల తరువాత బయట ఈస్కామ్ లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ సినియర్ నేత అయిన జగ్గారెడ్డి విప్ హొదాలో ఈ మనుషుల అక్రమ రవాణ దందాకు తెరలేపారని పోలీసులు తెలిపారు. మనుషుల అక్రమ రవాణా కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. మనుషుల అక్రమ రవాణా పైన ఇప్పడు పోలీసులు వేగం విచారణ చేస్తున్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే , సినియర్ నేత అయిన జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన ఆధికారాన్ని అడ్డం పెట్టుకుని తన కుటుంబ సభ్యుల పేర్లు మీద మరొకరిని అమోరికాకు తీసుకుని పోయినట్లుగా వెలుగులోకి వచ్చింది. సొమవారం మద్యాహ్నం సమయంలో సికింద్రాబాద్ నార్త్ జొన్ పరిధిలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.తరువాత జగ్గారెడ్డిని అరెస్టు చేశారు.

మరోసారి పాస్ పోర్ట్ స్కామ్…..

పాస్ పొర్టు స్కామ్ మరొక సారి బయట పడింది. ఊకంగా ఎమ్మెల్యే హుదాలోనే నకీలీ పత్రాలతో పాస్ పొర్టుతో పాటుగా అమోరికా వీసా లు తీసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. జగ్గారెడ్డితో పాటుగా కుటుంబ సభ్యులకు కూడా తప్పడు పత్రాలతో పాస్ పొర్టులు తీసుకున్నారన్న ఆరోపణలు నెపధ్యంలో జగ్గారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.2004 సంవత్సరంలో సంగారెడ్డి నియోజక వర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన ఆయన ప్రభుత్వ విప్ కూడా . తన కుటుంబం అమోరికాకు వెళ్లాలని అనుకుంటుంది. అందుకు గాను తనతో పాటుగా తన కుటుంబానికి పాస్ పోర్టు లు కావాలని రిక్వెస్టు పెట్టుకున్నారు. తన భార్య నిర్మల.. కూతురు జయలక్ష్మి. కూమారుడు భరత్ సాయి రెడ్డిగా పేర్కొన్నాడు. ఇందుకు గాను వారి ఫోటోలను కూడా పంపించాడు. ప్రభుత్వ విప్ ఏకంగా తన అధికారిక పత్రం మీద పాస్ పొర్టు ల కొరకు ధరఖాస్తు చేసుకొవడంతో అధికారులు ఏమి చూడకుండానే పాస్ పొర్టులు జారీ చేశఆరు. ఇదే తరహాలో అమోరికా ఎంబసీకి కూడా అధికారిక లెటర్స్ ను పెట్టుకున్నారు.

విప్ కావడంతో……

ప్రభుత్వ విప్ లేటర్ కావడంతో అమోరికా ఎంబసీ అధికారులు కూడా ఏమి చూడకుండానే వీసా లు ఇచ్చేశారు. దీంతో 2004 సంవత్సరంలో జగ్గారెడి తన నకీలీ కుటుంబ సభ్యులతో కలిసి అమోరికాకు వెళ్లారు. అమోరికాకు వెళ్లి అక్కడ కొన్నాళ్లు ఉన్నారు. తరువాత జగ్గారెడ్డి ఒక్కరే అమోరికా నుంచి తిరిగి వచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డి అమోరికాలో వదిలి వచ్చిన నకీలీ కుటుంబ సభ్యులు ఎక్కడ వున్నారో తెలియదని పోలీసులు అంటున్నారు. ఇదిలా వుంటే మరొక ఆసక్తి కరమైన విషయం కూడా బయటికి వచ్చింది. ఇప్పటి వరకు భార్య తో పాటుగా కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఇప్పటి వరకు పాస్ పోర్టులు లేవు. అంతేగాకుండా ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఇతర దేశాలు ఎక్కడికి కూడా వెళ్లలేదు. జగ్గారెడ్డి భార్య స్దానంలో అమోరికాకు తీసుకుని వెళ్లిన మహిళ ఎవరు అన్నది ఇప్పడు తేల్సాలి వుంది. అయితే డబ్బులు కోసం చేశారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

ఫిర్యాదు అందడంతో……

సోమవారం మద్యాహ్నం సమయంలో జగ్గారెడ్డి పైన నార్త్ జోన్ డిసిపి సుమతికి ఫిర్యాదు వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. వీసాతో పాటుగా పాస్ పొర్టు పత్రాలను తనీఖీలు చేశారు. అయితే ఇటీవల కాలంలో జగ్గారెడ్డి కొత్తగా పాస్ పొర్టు తీసుకున్నాడు. అది కూడా ఎందుకు అంటే అమోరికా వెళ్లినప్పడు వీసా స్టాంపింగ్ వుంటుంది. అయితే ఈ స్టాంపింగ్ ఉంటే ఎప్పడైనా ప్రమాదం అని గ్రహించి తన పాస్ పొర్టు పోయిందని చెప్పి కొత్త పాస్ పోర్టును ఇటివల కాలంలో జగ్గారెడ్డి తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. పటాన్ చెర్వు ప్రాంతంలో జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకుని వెంటనే టాస్క్ పొర్స్ కార్యాలయంకు తరలించారు. అక్కడ విచారణ చేసిన తరువాత అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇదిలా వుంటే జగ్గారెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ తో పాటుగా షబ్బీర్ అలీ, కుంతియాలు డిజిపిని కలిశారు. అరెస్టు అక్రమమని తెలిపారు. జగ్గారెడ్డి అరెస్టుపై ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వైపు జగ్గారెడ్డి సంగారెడ్డి భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతలో కుట్ర పూరితంగా జగ్గారెడ్డిని అరెస్టు చేసిన్నారని కాంగ్రెస్ పార్టీ విరుచుకు పడింది. ఏది ఏమైనా మనుషుల అక్రమ రవాణా మరొక సారి రాష్ట్ర రాజకీయాలను కుదిపి వేసింది. గతంలో కూడా కాసిపెట్ లింగయ్య, సొయం బాబురావులు కూడా మనుషులు అక్రమ రవాణా కేసులు అరెస్టు అయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*