ఆ కేసులో నా పేరు లేకపోయినా….?

మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయిన జగ్గారెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం తనను టార్గెట్ చేసిందన్నారు. మనుషుల అక్రమ రవాణాకేసులో తనను అక్రమంగా ఇరికించారన్నారు. తననున రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ కేసును బనాయించారన్నారు. వాస్తవానికి ఈ కేసులో తన పేరులేదని, హరీశ్ రావు, కేసీఆర్ పేరుందని, 14 ఏళ్ల తర్వాత తన పేరును చేర్చడం వెనక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయడమే తాను చేసిన నేరమని ఆయన ఆవేేదన వ్యక్తం చేశారు. మీ అరవై ఏళ్ల జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. తాను గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నాలుగున్నరేళ్ల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంగారెడ్డిలో ఆందోళన చేసినందునే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*