బ్రేకింగ్ : నా అరెస్ట్ వెనక వారే…..!

అక్రమంగా మనుషులను రవాణా చేశఆరన్న కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. గాంధీ వైద్యులు జగ్గారెడ్డి ఆరోగ్యం బాగానే ఉందని నివేదిక ఇవ్వడంతో ఆయన నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ కు తరలించారు. అయితే జగ్గారెడ్డి తనపై రాజకీయ కుట్ర జరిగిందన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనపై అక్రమకేసులు నమోదు చేయించి ఎన్నికల్లో గెలుద్దామన్న కుట్ర కోణం ఇందులో దాగి ఉందన్నారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. రాహుల్ గాంధీ సంగారెడ్డి సభ తర్వాత కాంగ్రెస్ పుంజుకుందని తెలియడంతోనే కె.చంద్రశేఖర్ రావు, హరీశ్ రావులు తనపై అక్రమ కేసులు బనాయించారన్నారు. రేపు సంగారెడ్డిలో జగ్గారెడ్డి మైనారిటీ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముందే అరెస్ట్ చేయడం రాజకీయ వేధింపులేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ఈ కేసును బయటకు తీయడంతోనే రాజకీయ దురాలోచన బయటపడుతుందని జగ్గారెడ్డి మీడియాకు తెలిపారు.