కత్తికి పదును పెట్టుకో… పోలీసులకు జేసీ సవాల్..!

తమను అవమానిస్తూ రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేస్తే నాలుకలు తెగ్గొస్తామంటూ పోలీస్ అధికారుల సంఘం చేసిన హెచ్చరికపై అనంతపురం ఎంసీ జేసీ దివాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాడిపత్రి ప్రభోదానంద ఆశ్రమం వద్ద జరిగిన గొడవలో పోలీసులు విఫలమయ్యారని, హిజ్రాల్లా పారిపోయారని ఇంతకుముందు జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నిన్న పోలీసు అధికారుల సంఘం ప్రతినిధి గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. ఇక మీదట ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నాలుకలు కోస్తామని హెచ్చరించారు. తాము మగాళ్లలా డ్యూటీ చేస్తున్నామని మీసం మెలేసి చెప్పారు.

ప్లేస్ నువ్వే చెప్పు… వస్తా…

మాధవ్ వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ నెల 25 వరకు జిల్లాలోనే ఉంటానని, కత్తి పదును పెట్టుకుని నాలుక కోయడానికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఎక్కడ నాలుక కోస్తారో.. ఎక్కడికి రావాలో చెబితే వస్తానని అన్నారు. రీల్ లైఫ్ వేరని… రియల్ లైఫ్ వేరన్నారు. మాధవ్ పై న్యాయపరంగా చర్యలే తీసుకుంటానని పేర్కొన్నారు. ఇంత పౌరుషమున్న పోలీసులు దాడి జరిగినప్పుడు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*