రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుంది

k.chandrasekharrao fire on chandrababunaidu

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అవసరమైతే తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడానికి సిద్ధంగా ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తాను ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వ్యతిరేకం కాదన్నారు. చంద్రబాబునాయుడు కేవలం రాజకీయ స్వప్రయోజనం కోసమే ప్రత్యేక హోదాను ఏపీలో వాడుకోవాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబుకు పాలన చేతకాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 1500కోట్లు, ఏపీ హైకోర్టు నిర్మాణానికి 500 కోట్లు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రాజకీయం కోసం చంద్రబాబు దేనికైనా దిగజారుతారని కేసీఆర్ మండిపడ్డారు. ‘‘హోదా వద్దని నువ్వే అంటావు…కావాలని నువ్వే అంటావు.. నిలకడగా లేకుండా నువ్వు ఉండి మమ్మలి అని ప్రయోజనం ఏంటి’’ అని ప్రశ్నించారు. చివరకు తెలంగాణ ఇండ్రస్ట్రియల్ పాలసీని కూడా దొంగిలించారన్నారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*