బ్రేకింగ్: కేసీఆర్ కు జానా సవాల్

24 గంటలూ కరెంట్ ఇస్తే తాను గులాబీ జెండాను పట్టుకుంటానని అనలేదని సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తాను అన్నట్లుగా రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. 24 గంటలు కరెంట్ ఇస్తే జానారెడ్డి గులాబీ కండువా కప్పుకుంటానని అన్న మాట మీద నిలబడాలని కేసీఆర్ నిన్న హుస్నాబాద్ సభలో అన్నారు. దీనికి ప్రతిగా జానారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను అలా అన్నట్లు రుజువు చేస్తే రాజకీయసన్యాసం స్వీకరిస్తాననిచెప్పారు. కేసీఆర్ అన్నీ అబద్ధాలు చెబుతున్నారన్నారు. అసలు కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో కారణం చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ అసహనం ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. అసహనం అంతా కేసీఆర్ లోనే ఉందని జానా అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని జానారెడ్డి జోస్యం చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*