జగన్ ది సర్కస్ కంపెనీ

kala venkatrao fire on ys jagan

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కస్ కంపెనీలాంటిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మంత్రి కళా వెంకట్రావు సెటైర్ వేశారు. జగన్ చేసే ఆరోపణల్లో నిజాలు తక్కువ అబద్ధాలు ఎక్కువ అని చెప్పారు. అసలు తాము వైఎస్సార్ కాంగ్రెస్ ను పార్టీగా గుర్తించడం లేదన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో జగన్ చేసిన ఆరోపణలపై కళా వెంకట్రావు స్పందించారు. జగన్ సందు గొందుల్లో సభలు పెట్టి తన ఛానెళ్లలో జనం వచ్చినట్లు చూపించి, స్పందన అమోఘమని రాయించుకుంటున్నారన్నారు. ఎప్పుడైనా జగన్ ఈ పాదయాత్ర లో బహిరంగ సభ పెట్టారా? అని సవాల్ విసిరారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్ కు లేదన్నారు. జగన్ పదహారేళ్ల వయసులోనే ఎర్రగడ్డ సూట్ కేసు బాంబులో ముద్దాయిగా ఉన్నారని కళా ఫైరయ్యారు. తోటపల్లి ప్రాజెక్టుపై జగన్ చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని కళా కొట్టిపారేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*