బాబు అనుభవం దానికే…!!!

kanna laxminarayana fire on chandrababunaidu

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం దొంగనాటకమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బాబు దోచుకోవడానికే ఈ శంకుస్థాపనల హడావిడి అని ఆయన అన్నారు. పదేళ్ల సమయంల ఉన్నాఐదేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం ఏపీకి అంతా చేస్తుందన్నారు. బాబు అనుభవం అవినీతికి ఉపయోగపడుతుందన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి టాస్క్ ఫోర్స్ వివరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. హైకోర్టును కేంద్ర ప్రభుత్వం విభజించిందని, అయితే దాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎలా పెడతారని కన్నా ప్రశ్నంచారు. కోర్టు భవనాలు సిద్ధంగా ఉన్నాయని చంద్రబాబు నివేదిక ఇవ్వడం వల్లనే కేంద్ర ప్రభుత్వం హైకోర్టు విభజనను చేసిందన్నారు కన్నా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*