అంతా సిద్ధం….మరి?

కర్ణాటక అసెంబ్లీ సమావేశం మరికాసేపట్లో ప్రారంభమవుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలకూ చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రొటెం స్పీకర్ గా బీజేపీ నేత బొపయ్య వ్యవహరిస్తున్నారు. ముందుగా సభ్యులందరిచేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యలేకు మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామి, సిద్ధరామయ్యలు సభలో ఎలా వ్యవహరించాల్సిందో చెప్పారు. వారికి దిశానిర్దేశంచేశారు. అలాగే బీజేపీ కూడా వ్యూహరచన చేసింది. మొత్తం మీద మరికాసేపట్లో కర్ణాటక శాననసభ ప్రారంభంకాబోతోంది. సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అసెంబ్లీకిచేరుకున్నారు. ఇక కుమారస్వామి తనకున్న ఎమ్మెల్యలతో కలసి విధానసభకు వచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*