బ్రేకింగ్ : గెలుపుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!

kcr comments on winning

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన స్వంత గ్రామం సిద్ధిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తాను ముందు నుంచీ చెబుతున్నట్లుగా టీఆర్ఎస్ కు చాలా అనుకూల పవనాలు ఉన్నాయని, ప్రభుత్వానికి ప్రజలు అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు చాలా అనుకూలంగా ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. మూడింట రెండొంతుల మెజారిటీతో తాము ఘన విజయం సాధిస్తామని, సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ లో ఈ విషయాన్ని చూడవచ్చన్నారు. ఓటింగ్ శాతం కూడా ఎక్కువ జరుగుతుందని, హైదరాబాద్ లో కూడా పోలింగ్ ఎక్కువగా నమోదవుతుందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*