మోదీతో కేసీఆర్…!

kchandrasekharao met narendra modi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ఆయన నాలుగు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో ఆయన ఈ టూర్ ఫిక్స్ చేసుకున్నారు. ఇంతకుముందు మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లినా ఆయన సమయం దొరకకపోవడంతో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి వచ్చారు. అయితే, ఢిల్లీలో నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై వివిధ పార్టీల నేతలతో సమావేశమై చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని కూడా జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 17న జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన ఈ పథకంపై మాట్లాడనున్నారు. కుదిరితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*