పొత్తులపై స్పష్టత ఇచ్చిన కోదండరాం

రానున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఎన్నికల్లో ప్రజలు తమకు స్పష్టమైన మెజారిటీ ఇస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కర్ణాటకలో జాతీయ పార్టీలు ప్రజలకు మేలు చేయలేదని, అందుకే అటువంటి ఫలితాలు వచ్చాయన్నారు. కానీ, తెలంగాణ లో హంగ్ ఏర్పడే అవకాశమే లేదని పేర్కొన్నారు. మండుతున్న పెట్రోల్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆయన, 2012 కంటే క్రూడాయిల్ ధర తక్కువగానే ఉన్నా పన్నుల కోసం ప్రభుత్వాల ఆరాటం కారణంగా ధరలు పెరుగుతున్నాయని అన్నారు. తమ పార్టీ తరుపున పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెయ్యి మంది దరఖాస్తు చెసుకున్నారని, త్వరలోనే వారికి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*