బ్రదర్స్ బాగా ఫాస్ట్..!

ఇంకా పొత్తులు ఖరారు కాలేదు… సీట్లు ఫైనల్ అవ్వలేదు. టికెట్లు ఎవరికో తెలియదు. కాంగ్రెస్ లో ఇంత కన్ ఫ్యూజన్ ఉంటే నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం ప్రచారాన్నే ప్రారంభించేశారు. ఇవాళ సాయంత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నియోజకవర్గంలో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఆలయాల్లో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచార గోడపత్రికలను ఆవిష్కరించారు. ఇక వారి అనుచరుడు చిరుమర్తి లింగయ్య తరుపున నకిరేకల్ నియోజకవర్గంలోనూ బ్రదర్స్ ప్రచారం ప్రారంభించారు. అయితే, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టిక్కెట్ ఖాయంగా కనపడుతున్నా… మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డికి ఇంకా డౌట్ గానే ఉంది. అక్కడ పాల్వాయి స్రవంతి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. కానీ, వెంకట్ రెడ్డి మాత్రం తాను నల్గొండ నుంచి, తన సోదరుడు మునుగోడు నుంచి పోటీ చేయడం, గెలవడం ఖాయమని చెబుతున్నారు.