కోమటిరెడ్డికి కేసీఆర్ ఊహించని గిఫ్ట్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. బుధవారం వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. అయితే, ఈ లేఖలో కోమటిరెడ్డిని ఎమ్మెల్యేగానే పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాల్లో వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరు హైకోర్టుకు వెళ్లగా అనర్హత వేటును కొట్టివేసింది. అయినా కూడా ప్రభుత్వం వీరిని ఎమ్మెల్యేలుగా గుర్తించడం లేదు. భద్రత, ఇతర సదుపాయాలు కల్పించడం లేదు. పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మళ్లీ హైకోర్టులో పిటీషన్ వేయించింది. ఇటువంటి సందర్భంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ముఖ్యమంత్రే స్వయంగా ఎమ్మెల్యేగా పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*