నాకే దిక్కు లేదు… ఆయనకేం తొందర..

komatireddy venkatareddy indian national congress

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయడంతో పాటు స్వంత పార్టీ నేతలను కూడా తప్పుపట్టారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుంచుకోవాలని పేర్కన్నారు. అయితే, ఇటీవల సీఎం కావడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉండి, ఎన్ఎస్ యూఐ, యువజన కాంగ్రెస్ నుంచి పార్టీకి సేవ చేస్తున్న తనకే దిక్కులేదని, కొత్తగా పార్టీలో రేవంత్ రెడ్డికి ఏం తొందర అని అన్నారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత జానారెడ్డి, రేవంత్ రెడ్డికి మాత్రమే కాదు, అందరికీ ఉందని స్పష్టం చేశారు. తనతో పాటు మొదటిసారి ఎమ్మెల్యే అయిన సంపత్ కుమార్ కి కూడా ఆ అర్హత ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించుకోవడానికి అందరకం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*