నన్ను చంపేందుకే..

తనను అంతమొందించేందుకే సెక్యూరిటీని తొలగించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ప్రభుత్వం కోర్టు థిక్కారానికి పాల్పడిందని, జూన్ 4న ప్రభుత్వంపై కోర్టు థిక్కారం కేసు వేస్తున్నానని తెలిపారు. కోర్టును థిక్కిరించిన అధికారులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ప్రస్తుత పీసీసీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని, పార్టీలోని సీనియర్లను ఏఐసీసీ స్థాయిలో ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్ష పదవికి అర్హుడినేనని, ఒకవేళ తనకు పీసీసీ పదవి ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయనని, రాష్ట్రంలో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*