అందుకే కొండ్రు చేరిక వాయిదా

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీ చేరిక ఈ నెల 6వ తేదీకి వాయిదా పడింది. కొండ్రుమురళి గత నెల 31వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరాల్సి ఉంది. ఈ మేరకు అనుచరులతో కలసి అమరావతి వెళ్లి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు కొండ్రు మురళి అంతా సిద్ధం చేసుకున్నారు. కాని నందమూరి హరికృష్ణ మరణంతో చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో కొండ్రు చేరిక వాయిదా పడింది. దీంతో ఈ నెల6వ తేదన అమరావతిలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*