కౌశల్ పై కుట్ర జరుగుతోందా?

బిగ్ బాస్ లో టాస్క్ లు వ్యూహం ప్రకారం జరుగుతున్నాయా? అవుననే అనిపిస్తోంది. ఫైనల్ కు సామ్రాట్ వచ్చేశారు. ఇంకో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో బిగ్ బాస్ టాస్క్ ల మీద టాస్క్ లు ఇస్తున్నారు. గ్రాండ్ ఫినాలేకి చేరుకోవాలంటే బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో రోల్ రైడా, సామ్రాట్ లు నిలిచారు. వీరిద్దరికీ కోడిగుడ్డు టాస్క్ లు ఇచ్చారు. ఈ టాస్క్ లో బౌల్ లో ఉన్న కోడిగుడ్లను కింద పడిపోనివ్వకూడదు. అలాగని బౌల్ కింద పెట్టకూడదు. ఈ టాస్క్ లో తనిష్, గీతామాధురి, దీప్తిలు సామ్రాట్ కు అండగా నిలిచారు. రోల్ రైడాకు కౌశల్ మద్దతు పలికారు.

మైండ్ గేమ్ ఆడిన సామ్రాట్……

అయితే గీతామాధురి బౌల్ లో ఉన్న కోడిగుడ్డు కాకుండా ఇంట్లో ఉన్న మరోకోడిగుడ్డును తెచ్చి సామ్రాట్ కు ఇచ్చారు. సామ్రాట్ మైండ్ గేమ్ ఆడారు. తాను రోల్ రైడాకే ఛాన్స్ ఇస్తానంటూ సామ్రాట్ గీతామాధురి ఇంట్లోనుంచి తెచ్చిన కోడిగుడ్డును నేలకేసి కొట్టారు. రోల్ రైడా కిచెన్ లో ఉన్న కప్ బోర్డులో దాక్కుని తన కోడిగుడ్లను దాచి పెట్టుకుని టాస్క్ ఆడుతుండగా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. రోల్ రైడా బయటకు వచ్చి ఆడాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో బయటకు వచ్చిన రోల్ రైడా చేతిలో కోడిగుడ్లను దీప్తి, గీతామాధురి పగులకొట్టేశారు. కౌశల్ ఎంత అడ్డుకున్నా రోల్ రైడా తన కోడిగుడ్లను భద్రంగా ఉంచుకోలేకపోయారు.

కౌశల్ ఎంత ప్రయత్నించినా…..

తర్వాత కౌశల్ సామ్రాట్ చేతిలోని కోడిగుడ్లను పగలకొట్టేందుకు ఎంత ప్రయత్నించినా తనిష్, గీతామాధురి, దీప్తి అడ్డుకున్నారు. రోల్ రైడాకు రిబ్స్ పెయిన్ రావడంతో తాను పోటీ నుంచి విరమించుకున్నానని, సామ్రాట్ గెలిస్తే చాలని ప్రకటించాడు. దీంతో కౌశల్ కూడా ఏం చేయలేక పోయారు. మొత్తం మీద బిగ్ బాస్ షోలో సామ్రాట్ ఫైనల్ కు చేరుకోవడానికి తనిష్, గీతా మాధురి, దీప్తిలు శక్తిమేరకు ప్రయత్నించారు. టాస్ గెలిచిన తర్వాత దీప్తి, సామ్రాట్ లు కన్నీటి పర్యంతమయ్యారు. మొత్తం మీద బిగ్ బాస్ షోలో కౌశల్ కు వ్యతిరేకంగా అందరూ ఒక్కటయ్యారన్నది సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చేస్తున్న ఆరోపణ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*