క్రిష్ ఫైనల్.. కానీ.. ?

మార్చ్ 29న ఎంతో గ్రాండ్ గా బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ షూటింగ్ ని మొదలు పెట్టాడు. రెండ్రోజులు సజావుగా సాగిందా షూటింగ్. కానీ ఈ సినిమా డైరెక్టర్ తేజ ఈ సినిమా నుంచి బయటికి వచ్చేసాడు. అయితే తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ దర్శకులుగా అనేకమంది పేర్లు వినబడ్డాయి. ఇక బాలకృష్ణే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడనే న్యూస్ కూడా హల్ చల్ చేసింది. మహానటి సినిమా వచ్చాక ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అనేక నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే తాజాగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేసిన దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక క్రిష్ ఈ ప్రాజెక్ట్ ని చేపట్టడం పక్కా అని, కానీ ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉందంటున్నారు.

ఇప్పటికే మణికర్ణిక…

అయితే ఇప్పటివరకు తేజ ఎన్టీఆర్ పై చేసిన రీసెర్చ్ ని దర్శకుడు క్రిష్ ఒకసారి పరిశీలించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే తేజ చేసిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ పరిశీలించిన తర్వాతే క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని చెయ్యాలా వద్దా అని డెసిషన్ తీసుకుంటాడని చెబుతున్నారు. మరి క్రిష్ ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ని మణికర్ణిక పేరుతొ తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా ఆగష్టు లో విడుదల కానుంది. ఇప్పటికే ఒక బయోపిక్ చేస్తున్న క్రిష్ అయితే ఎన్టీఆర్ బయోపిక్ ని బాగా తెరకెక్కిస్తాడని బాలయ్య కూడా అనుకుంటున్నాడట. ఇక తేజ విషయంలో బాలయ్య కాస్త ఎక్కువ ఇన్వాల్వ్ అయినా క్రిష్ దగ్గరకొచ్చేసరికి బాలయ్య సైలెంట్ అవుతాడంటున్నారు.

2019 ఎన్నికల నాటికి..

మహానటి సినిమా వచ్చాక బాలయ్య మైండ్ సెట్ కూడా మారిందంటున్నారు. మహానటి సినిమాలో సావిత్రి జీవిత కథను, నిజ జీవితాన్ని రెండిటీని వివాదాల జోలికి పోకుండా నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించాడు. అందుకే క్రిష్ కి కూడా పూర్తి స్వేచ్ఛనిస్తే ఎన్టీఆర్ బయో పిక్ ని అద్భుతంగా తీసి ప్రేక్షకులకందిస్తాడు అని బాలయ్య కి సన్నిహితులు సలహా ఇస్తున్నారట. మరి క్రిష్ గనక ఎన్టీఆర్ బయోపిక్ కి సై అంటే ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టి.. 2019 ఎన్నికల నాటికి ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*