కేటీఆర్ గొప్ప మ‌న‌స్సు

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ మంత్రి త‌న గొప్ప మ‌న‌స్సును చాటుకున్నారు. అనాధ పిల్ల‌ల‌ను ఆదుకుని వారిలో సంతోషం నింపారు. హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ అనాధ పిల్లల కోసం హైద‌రాబాద్ లో ఓ ఆశ్ర‌మం న‌డిపేది. అయితే, నిధుల కొర‌త వ‌ల్ల ఆశ్ర‌మం న‌డ‌ప‌లేని ప‌రిస్థితి ఉంద‌ని, పిల్ల‌లు రోడ్డుపై ప‌డ‌కుండా ఎవ‌రైనా ఆదుకోవాల‌ని నిన్న ట్విట్ట‌ర్ లో విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో వెంట‌నే స్పందించిన కేటీఆర్ వారిని ఆదుకునేందుకు త‌న స్వంత డబ్బులు 10 ల‌క్ష‌లు ఇస్తాన‌ని ట్వీట్ చేశారు. అంత‌టితో ఆగ‌కుండా ఇవాళ దీపావ‌ళి సంద‌ర్భంగా ఆ పిల్లు అంద‌రినీ త‌న ఇంటికి పిలిపించుకొని వారితో ఉత్సాహంగా గ‌డిపారు. పిల్ల‌ల‌కు స్వీట్లు, బాణాసంచా పంచిపెట్టారు. దీంతో పాటు పిల్ల‌ల బాగోగులు చూసుకోవాల‌ని స‌ద‌రు సంస్థ‌కు రూ.12 ల‌క్ష‌ల చెక్కును అందించారు. దీంతో పిల్ల‌ల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*