జూనియర్ రాజకీయ జీవితాన్ని ఖతం చేయాలనే కుట్ర

ktramarao,harishrao calaculations

నందమూరి తారకరామారావు కుటుంబం మీద చంద్రబాబు నాయుడుకి అంతలా ప్రేమ ఉంటే నందమూరి సుహాసినిని తీసుకెళ్లి తన కుమారుడిలా ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేయవచ్చు కదా అని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. గురువారం కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ… ఒకవేళ తెలంగాణలో టీడీపీ ఉండాలనే ఆరాటం చంద్రబాబుకు ఉంటే నారా లోకేష్ ను తీసుకువచ్చి కూకట్ పల్లిలో నిలబెట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇక్కడ ఎలాగూ సుహాసిని ఓడిపోతారని చంద్రబాబుకు తెలుసని, ఓడిపోతే ఆమెతో పాటు ఆమె తమ్ముళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాజకీయ జీవితాలను ఇక్కడే ఖతం చేసి నారా లోకేష్ కి అక్కడ పోటీ లేకుండా చేసుకోవాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఒక మినీ భారతదేశమని, ఇక్కడ అందరికీ సమాన హక్కు ఉంటుందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*