వారితో భేటీ అయిన కుమారస్వామి

జేడీఎస్ నేత కుమారస్వామి ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వచ్చే బుధవారం కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారం ఉండటంతో వారిని ఆహ్వానించేందుకు స్వయంగా వచ్చారు. దీంతో పాటు కర్ణాటక మంత్రి వర్గంపై కూడా కాంగ్రెస్ అధినేతలతో చర్చించనున్నారు. కాంగ్రెస్ కు ఎన్ని మంత్రిపదవులు? జేడీఎస్ కు ఎన్ని మంత్రి పదవులివ్వాలన్న దానిపై ఆయన సోనియా, రాహుల్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ సూచనలు తీసుకోనున్న కుమారస్వామి, జేడీఎస్, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫేస్టో అమలుపై కూడా వీరితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలన్న దానిపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*