బ్రేకింగ్ : కుమారస్వామి సంచలన కామెంట్స్

crisis in karnataka government

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్నికూల దోయడానికి కుట్ర పన్నుతోందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తుందన్న కుమారస్వామి ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తుందని చెప్పారు. ముంబై, పూణేలకు తీసుకెళ్లి బలపరీక్ష సమయానికి కర్ణాటక తీసుకొచ్చేలా ప్లాన్ చేసినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే పార్టీని ఇక్కడ అధికారంలోకి తేవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని కుమారస్వామి యడ్యూరప్ప పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేసిందని ఆయన ఆరోపించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*