పోలీసులను అడ్డుకున్న లగడపాటి

trs leaders at lagadapati rajagopal house

అర్ధరాత్రి హైదరాబాద్ లోని  వ్యాపారవేత్త జీపీ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడాన్ని మాజీ ఎంపీ లగడపాటి అభ్యంతరం వ్యక్తం చేశారు. సోదాలు నిర్వహించడానికి సెర్చ్ వారెంట్ ఉందా? అని లగడపాటి ప్రశ్నించారు. సోదాలు నిర్వహించడానికి సెర్చ్ ఉండాలా? వద్దా? అని పోలీసులను లగడపాటి నిలదీశారు. ఓ భూ వివాదంలో వ్యాపార వేత్త జీపీరెడ్డి ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించారు.

పోలీసు అధికారికి అనుకూలంగానే…..

ఐపీఎస్ అధికారి నాగిరెడ్డికి అనుకూలంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు లగడపాటి చెబుతున్నారు. అర్థరాత్రి 12 గంటలకు సోదాలు ఏంటని ఆయన గట్టిగా మాట్లాడటంతో వారు మౌనం వహించారు. ఆ భూమి తనది కాదని, తనకు సంబంధించి వారు కొనుగోలు చేశారని జీపీరెడ్డి చెబుతున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తన మిత్రుడుకు అండగానే తాను ఆయన ఇంటికి వచ్చానని లగడపాటి తెలిపారు. సివిల్ వివాదంలో పోలీసులు తలదూర్చడమేంటన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*