మహాకూటమిలో కొత్త చిచ్చు..!

Mahakutami renamed as praja kutami

ఎట్టకేలకు తెగిందనుకున్న మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తెలంగాణ జన సమితికి 8 సీట్లు కేటాయించినట్లు కాంగ్రెస్ చెప్పగా… 12 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు టీజేఎస్ ప్రకటించింది. బుధవారం సాయంత్రం టీజేఎస్ పోటీ చేయనున్న నియోజకవర్గాలను ప్రకటించారు. దుబ్బాక, మెదక్, మల్కాజ్ గిరి, అంబర్ పేట్, వరంగల్ ఈస్ట్, సిద్ధిపేట, వర్ధన్నపేట, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్ పూర్, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, జనగాం స్థానాల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే తెలుగుదేశం….

అయితే, మహబూబ్ నగర్ స్థానానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎర్ర శేఖర్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక స్టేషన్ ఘన్ పూర్ స్థానానికి కాంగ్రెస్ ఇందిరను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక జనగామ సీటు తనదే అని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు. మొత్తానికి ముగిసిందనుకున్న సీట్ల పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. అయితే, మహాకూటమి కొనసాగుతుందని టీజేఎస్ నేతలు ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*