నగ్న వీడియోలు తీసి..బెదిరించి….?

హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో యువతులకు వల వేశాడు. ఈజీ మనీ కోసం జాబ్ లు పేరుతో అమ్మాయిల నుండి లక్షలు రూపాయలు వసూలు చేశాడు షేక్ మస్తాన్. 30 మంది యువతులను ట్రాప్ చేసి అత్యాచారం చేసిన షేక్ మస్తాన్ వలి. ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు పేరుతో అమ్మాయిలను లోబర్చుకున్నాడు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. నగ్న ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దీంతో బాధిత యువతులు రాచకొండ ఎస్ ఓ టీ పోలీసులు ను ఆశ్రయించారు. నిందిడితుడు మస్తాన్ వలి ని పోలీసులు వలపన్ని గుంటూరు లో అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు తో క్రెడిట్ కార్డులు పొందినట్లు విచారణలలో వెల్లడయింది. కుషాయిగూడ, ఘట్కేసర్ , నాచారం లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు మస్తాన్ వలిపై అందాయి. 2016 నుండి పరారీలో ఉన్న షేక్ మస్తాన్ వలి అలియాస్ మున్నా. మస్తాన్ వలికి సహకరించిన సంతోషి , నవనీత, రవి పరారీలో ఉన్నారు.

పదుల సంఖ్యలో యువతులను…..

మస్తాన్ వలీ…అలియాస్ షేక్ మున్నా గుంటూర్ కి చెందిన వ్యక్తి. ఇతను 2007లో హైదరాబాద్‌ వచ్చి బీకాం పూర్తి చేసాడు…ఏ ఉద్యోగం దొరక్క తిరుగుతున్న సమయంలో ఇక్కడ జాబ్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న సంతోషి, నవనీత, రవిలతో పరిచయం ఏర్పడింది. ఉద్యోగాల పేరుతో వారు రూ.లక్షలు గడిస్తున్నవిషయాన్ని మస్తాన్ వలీ తెలుసుకుని తాను కూడా ఈజీ మనీ కోసం ఈ ముగ్గురి సహకారంతో బేగంపేట, విద్యానగర్‌ ప్రాంతాల్లో కార్యాలయాలు తెరిచాడు …..రెండు తెలుగు రాష్ర్టాల్లో నిరుద్యోగ యువతుల్ని టార్గెట్ చేసి …వారికి ఉద్యోగాల పేరిట వల విసిరి …ఉద్యోగం ఆశ చూపి వారిపై అత్యాచారం చేస్తాడు..ఇలా ఒకరు కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వీడి బాధితులు ఉన్నారు..అంతే కాదు కొందరి యువతులపై అత్యాచారం చేసి ఆ వీడియోలు తీసి వారిని బెదిరించాడు. డబ్బులు డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే వాటిని ఇంటర్ నెట్ లో పెడతానని టార్చర్ చూపించాడు.ఉద్యోగాలు రాని బాధితులు అతనిపై ఒత్తిడి చేస్తుండటంతో 2016లో కార్యాలయాన్ని మూసేసి పరారయ్యాడు. దీంతో బాధితులు కుషాయిగూడ, ఘట్‌కేసర్‌, నాచారం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*